ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నదాన భవన నిర్మాణానికి భక్తులు రూ. 1, 63, 905 విరాళంగా అందజేసినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు తెలిపారు. అంబాజీపేట వాస్తవ్వులువాస్తవ్యులు నిచ్చెన కోళ్ళ మునేశ్వరరావు వేంకట లక్ష్మి దంపతులు శుక్రవారం స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళాన్ని సమర్పించినట్లు తెలిపారు.