కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం కేంద్ర బడ్జెట్ 2025-26పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. పి. రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థను దిశానిర్దేశం చేసే ప్రధాన పత్రం అన్నారు. విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమలు, పన్ను విధానం, ఉపాధి వంటి రంగాల బడ్జెట్ ప్రభావాన్ని విద్యార్థులు అవగాహన చేసుకోవాలన్నారు.