కొత్తపేట: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి

66చూసినవారు
కొత్తపేట: క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి
క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి కనీస అవగాహన ఉండి ప్రారంభంలోనే వ్యాధిని గుర్తించి మంచి వైద్య చికిత్స పొందితే కొంతవరకు క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చని కొత్తపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ జి. దుర్గాప్రసాద్ సూచించారు. కొత్తపేట సిహెచ్సి కార్యాలయ ఆవరణలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా రోగులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఐఈసి మెటీరియల్ ను ప్రదర్శించారు.

సంబంధిత పోస్ట్