సమాజంలోని పరిస్థితుల పట్ల బాలబాలికలు అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని కొత్తపేట ఐసిడిఎస్ పలివెల సెక్టర్ సూపర్వైజర్ కె. చంద్రకళ సూచించారు. కొత్తపేట మండలం గంటి జడ్పీ హైస్కూల్ లో శుక్రవారం హెచ్ఎం అక్కిరెడ్డి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బాలిక కిశోరం కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు ను నిర్వహించారు. బాలికలపై లైంగిక దాడులు, పోషకాహారం వంటి అంశాల గురించి వివరించారు.