ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని కోరుతూడి. ఎస్. పి గోవిందరావు ఆదేశాల మేరకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు కొత్తపేట ఎస్సై జి. సురేంద్ర తెలిపారు. కొత్తపేటలో శనివారంఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. హెల్మెట్ వినియోగం ద్వారా కలుగు ప్రయోజ నాలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు, మైకు ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్లు ధరించాలని విజ్ఞప్తి చేశారు.