విద్యుత్ ఘాతానికి గురై ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని గుమ్మిలేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై ఎం. అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం అదే గ్రామానికి చెందిన ముచ్చూరి వీర్రాజు (40) అనే కౌలు రైతు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పశువుల మేత(పచ్చగడ్డి) సేకరించుకుని ఇంటికి వస్తుండగా 33 కెవి విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు.