ఎన్నికల్లో కోరుమిల్లి ప్రజలు తనను ఓడించలేదని కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన్ని గెలిపించారని మండపేట నియోజక వర్గ వైసిపి ఇన్ ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేట విజయలక్ష్మి నగర్ లో వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే వేగుళ్ళ ను మూడు అంశాలపై ఆరోపణలు చేస్తే. వాటికి సమాధానం ఇవ్వడం మానేశారన్నారు.