కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శనివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల వద్ద నుండి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. అనంతరం స్వీకరించిన వినతులకు పరిష్కార మార్గం చూపుతామని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్, చీకట్ల అబ్బు, బూసి భాస్కరరావు పాల్గొన్నారు.