ప్రతి పేదవాని సొంతింటి కల నెరవేరడమే భారత ప్రధాని మోదీ లక్ష్యమని రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుందని ప్రకటించడం పట్ల పాలూరి సత్యానందం హర్షం వ్యక్తం చేశారు.