రావులపాలెం: దూర ప్రాంత విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం
దూర ప్రాంత విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన (మిడ్ డే మీల్స్) పథకం తీసుకొచ్చిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మధూర్ శనివారం ప్రారంభించారు.