నేను సైతం స్వచ్చంత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి నడచి వెళ్లే భక్తులకు ఈ అన్నదాన సదుపాయాన్ని ఏర్పాటు చేసిన సంస్థ సభ్యులను అభినందించారు.