సాంకేతికత సాయంతో వ్యవసాయంలో ముందడుగు వేసి రైతులకు అండగా నిలబడటమే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు అనుబంధ రంగాలు ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన పొలంపిలుస్తోంది కార్యక్రమానికి ఎమ్మెల్యే సత్యానందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.