ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని నియోజకవర్గ పరిశీలకులు పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు ఆదేశాల మేరకు యువ నాయకులు బండారు సంజీవ్ ఆధ్వర్యంలో రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ పరిశీలకులు వెంకట గణేష్ కుమార్ పాల్గొన్నారు.