ముమ్మిడివరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలకు కొత్తపేట కాపు కల్యాణ మండపం వద్ద శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణ రెడ్డీ, చిలువూరి సతీష్ రాజు, కంఠంశెట్టి శ్రీనివాస్, బూసి జయలక్ష్మి భాస్కరరావు పాల్గొన్నారు.