మండపేట పట్టణంలో మద్యం సేవించి న్యూసెన్స్ చేస్తున్న పదిమంది ముద్దాయిలను పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేసి శుక్రవారం ఆలమూరు సివిల్ కోర్టులో ప్రవేశపెట్టారు. వారందరికీ జడ్జి ఐ ప్రవీణ్ కుమార్ రూ. 100 జరిమానాతో పాటు పరిసరాలను శుభ్రం చేయించాలని శిక్షను విధించారు. దానితో పోలీస్ సిబ్బంది సమక్షంలో స్థానిక ట్రెజరీ కార్యాలయాన్ని వారితో అధికారులు శుభ్రం చేయించారు.