వృద్ధాప్యంతో పనిచేసే ఓపిక లేక ఇంటి వద్ద ఉంటూ తినడానికి తిండి లేక బాధపడుతున్న ఓనిరుపేద కుటుంబానికి మనసున్న మారాజులు చేయూత అందించారు. మండపేట మండలంలోని పాలతోడు పాకలలో నివాసముంటున్న ఆ కుటుంబానికి మారేడుబాకలో పరుపుల కంపెనీ నడుపుతున్న జిఎస్ ఇండస్ట్రీ అధినేత గుత్తుల గోవిందరాజు శుక్రవారం రూ 5 వేలతో నిత్యవసర సరుకులు అందించి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మారేడుబాక సర్పంచ్ మట్టపర్తి గోవిందరాజు పాల్గొన్నారు