మండపేట: ఎంటిఎస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి

69చూసినవారు
మండపేట: ఎంటిఎస్ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి
చాలిచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్న ఏం టి ఎస్ ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని ఏంటిఎస్ ఉద్యోగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటిపల్లి రాంబాబు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కు విజ్ఞప్తి చేశారు. టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవి విరమణ వయసు పెంచాలని కోరారు.

సంబంధిత పోస్ట్