తనకు దొరికిన పర్సును యజమానికి అప్పగించి ఓ నర్సరీ రైతు తన నిజాయితీని చాటుకున్నాడు. ఈనెల4న మండపేటకు చెందిన శ్రీ సుధ ఆటో కన్సల్టెన్సీ షాపు యజమాని డేగల లక్ష్మణరావు జేగురుపాడు వెళ్ళి వస్తుండగా మార్గ మధ్యలో పర్సు పోగొట్టుకున్నారు. పర్సులోరూ. 5514 నగదు, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఈ పర్సు మండపేట కు చెందిన పలివెల సాయికి దొరికింది. పర్సులోని విసిటింగ్ కార్డు ఆధారంగా పర్సును బుధవారం యజమానికి అప్పగించాడు.