స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాట్రేనికోన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభచూపిన మారేటి స్వప్నకు గణిత ఉపాధ్యాయిని సీతామహాలక్ష్మి రూ. 10 వేల నగదును తెదేపా నాయకుడు నాగిడి నాగేశ్వరరావు చేతుల మీదుగా అందించారు. మాజీ మంత్రి మోకా శ్రీవిష్ణుప్రసాదరావు జ్ఞాపకార్థం ఆయన భార్య చంద్రనాగరత్నం రూ. 5 వేలు, గణిత ఉపాధ్యాయుడు పాలెపు జగన్నాథం తన తండ్రి జ్ఞాపకార్ధం రూ. 5 వేలను విద్యార్దులకు అందజేసారు.