కాట్రేనికోన: ప్రధాన రహదారిపై వాహనదారుల ఇబ్బందులు

67చూసినవారు
కాట్రేనికోన మండలం కందికుప్ప రక్షిత మంచినీటి పథకంలో పైప్ లైన్ మరమ్మతులు నేపథ్యంలో మహిపాల చెరువు-పల్లంకుర్రు రహదారిపై కందికుప్ప సెంటర్లో రోడ్డును తవ్వారు. పనులు పూర్తి అయ్యాక రోడ్డును సరిగ్గా పూడ్చకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గురువారం వర్షం పడడంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్