కాట్రేనికోన మండలం పల్లంకుర్రుకు చెందిన టీ దుర్గా ప్రసాద్ కు స్వాతంత్ర దినోత్సవ పురస్కారం లభించింది. ప్రసాద్ అమలాపురం ఆర్డిఓ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ కం టైపిస్ట్ గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలుకు గుర్తింపుగా అమలాపురంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్, జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ చేతులు మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.