కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు, వాలంటీర్ల తొలగింపు, ఉద్యోగుల తొలగింపు వంటి అరాచకాలు ఎక్కువ అయిపోయాయని కాట్రేనికోన మండల వైసీపీ పార్టీ అభిప్రాయపడింది. మంగళవారం వైసీపీ నాయకుడు పాలెపు ధర్మారావు స్వగృహంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంసాని నాగేశ్వరరావు, నడింపల్లి సూర్యనారాయణ రాజు, గంటి వెంకట సుధాకర్ తదితరులు ఉన్నారు.