ముమ్మిడివరంలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నగర పంచాయతీ పరిధిలోని కాశీవారితూము సమీపంలోని 216 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు అనుకున్న పంట పొలాల్లో కోతులు మంగళవారం గుంపులుగా సంచరించాయి. సమీప ప్రాంతాల్లోని నివాస గృహాల్లోకి వెళ్లి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కోతులను చూసి చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు.