ముమ్మిడివరం మండలం అన్నంపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. యానం నుండి పల్లంకుర్రు మోటార్ సైకిల్ పై వెళుతున్న ముగ్గురు యువకులు ఎదురుగా వస్తున్న వ్యాన్ ను తప్పించబోయి డివైడర్ ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో పల్లంకుర్రు శివారుకు చెందిన బూల చింటూ (20) అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.