ముమ్మిడివరం నియోజకవర్గ తాళ్లరేవు ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం శనివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.