ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కాట్రెనికోన మండలం చెయ్యేరులో తెదేపా నాయకులు ప్రచారం నిర్వహించారు. మంగళవారం గ్రాడ్యుయేట్ ఓటర్లను వారి ఇంటి వద్ద కలిసి కూటమి అభ్యర్థికి ఓటేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి సుబ్బరాజు, డిసి ఆకాశం శ్రీనివాస్, వెంట్రు సుధీర్, సర్పంచ్ చెల్లి సురేశ్, తదితరులు పాల్గొన్నారు.