ఐ. పోలవరం మండలం మురమళ్లలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీభద్రకాళి సమేత వీరేశ్వరస్వామి కళ్యాణోత్సవం శనివారం రాత్రి వైభవంగా జరిగింది. పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. మూడుముళ్ల బంధాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్లు వినిపించారు. ఆలయ ఈవో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కళ్యాణోత్సవం జరిపించారు. భక్తులు భారీగా పాల్గొన్నారు.