వసంత నవరాత్రి మహోత్సవాలు మూడవ రోజుకు చేరిన సందర్భంగా గురువారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో సోమేశ్వర శర్మ, చెరుకూరి రాంబాబు తదితరులచే శాస్త్రోక్తంగా పూజకు చేసి నూతన పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూజల అనంతరం పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేశారు.