జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభను భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ సభ పిఠాపురం మండలంలో చిత్రాడ గ్రామంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. శుక్రవారం జరిగే ఈ సభకు లక్షలాదిమంది జనసైనికులు వస్తారని అంచనా వేస్తున్నారు. వివిధ డిజైన్లతో ఏర్పాటు చేసిన ఈ స్టేజి పలువురిని ఆకట్టుకుంది. సభకు హాజరైన వారికి కనిపించేలా పలు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అన్ని స్థాయిల్లో ఉన్న జనసేన నాయకులు ఇప్పటికే హాజరయ్యారు.