నేడు ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటన వివరాలు ఇలా

60చూసినవారు
నేడు ఉపముఖ్యమంత్రి పవన్ పర్యటన వివరాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జిల్లాలో మూడు రోజులు పర్యటనలను భాగంగా మొదటి రోజు సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 6 గంటలకు హైదరాబాదులోని తన నివాసం నుంచి బేగంపేట ఏర్పాటుకు బయలుదేరుతారు. 6: 30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 7: 20 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. 7: 30 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 9గంటలకు చేబ్రోలులో తన నివాసానికి చేరుకుంటారు. 10గంటలకు గొల్లప్రోలు పట్టణంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాలు నందు ఎన్టీఆర్ ఫించన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మద్యాహ్నం 1గంటకు చేబ్రోలు గ్రామంలో తన నివాసానికి చేరుకుని జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో సమావేశమవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్