కాజులూరు మండల పరిసర గ్రామాల్లో శుక్రవారం పంపిణీ చేయనున్న ఉచిత ఎలుకల ముందు పంపిణీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి వి. అశోక్ పిలుపునిచ్చారు. కాజులూరులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం వరి పంటపై ఎలుకల బెడద ఎక్కువగా ఉందన్నారు. ఎలుకల నివారణ కొరకు వ్యవసాయ శాఖ బ్రమోడయాలిన్ మందును ఉచితంగా సరఫరాచేస్తుందన్నారు. రైతులందరూ సామూహికంగా ఎలుకల నివారణకు కృషి చేయాలన్నారు.