ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం పట్ల జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి ఇళ్ళ వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజలు అమ్ ఆద్మీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేసి బాణ సంచాకాల్చి వేడుకలు జరుపుకున్నారు.