రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో రామచంద్రపురం మండలంలోని ఐదు గ్రామాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. సుందరపల్లి నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సేవలు శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు. నెలపర్తిపాడు గ్రామంలో ఆర్టీసీ బస్ కొత్త రూటు ప్రారంభోత్సవం లో మంత్రి సుభాష్ పాల్గొని బస్సు సర్వీస్ ను ప్రారంభించారు.