రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కృష్ణాజిల్లా పామర్రు నియోజవర్గంలో బుధవారం జోరుగాఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పామర్రు పట్టణంలోని వార్డుల వారీగా విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటిరాజా ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మరియు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు పాల్గొన్నారు.