గ్రామస్థాయిలో భూవివాదాలను పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రెవెన్యూ సమస్యల పరిష్కారం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి గ్రామస్థాయిలో డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు జరుగుతాయన్నారు.