రైతు బజార్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. పురపాలక సంఘం రూ. 80 లక్షల రూపాయలతో 25 సెంట్లు విస్తీర్ణంలో 25 షాపులు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను మంత్రి సుభాష్ ఆదేశించారు.