రామచంద్రపురం: జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా

74చూసినవారు
రామచంద్రపురం: జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటా
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి గా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం తాను అండగా ఉంటానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఇటీవల రామచంద్రపురంలో అకాల మరణం పొందిన దివంగత సుర్ల నూకరాజు కుటుంబసభ్యులను స్థానిక జర్నలిస్టులతో కలిసి ఆదివారం మంత్రి సుభాష్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టు నూకరాజు మరణం తీరనిలోటని, వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్