రామచంద్రపురం పట్టణం చప్పిడి వారిసావరం, హౌసింగ్ కాలనీలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనల మేరకు ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీ ఇంఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో నియోజకవర్గ అబ్జర్వర్ కాకినాడ రామారావు ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.