కోనసీమలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయని డీఐఈఓ సోమశేఖర్ రావు శనివారం తెలిపారు. చివరి రోజు ఫస్ట్ ఇయర్లో మొత్తం 3, 907 మందికి 3, 632 మంది హాజరుకాగా 275 మంది గైర్హాజరయ్యారన్నారు. ఒకేషనల్లో 474 మందికి 210 మంది హాజరుకాగా 264 మంది హాజరుకాలేదన్నారు. సెకండ్ ఇయర్లో 712 మందికి 642 మంది హాజరయ్యారని, 70 మంది గైర్హాజరయ్యా రన్నారు. ఒకేషనల్లో 108 మందికి 69 మంది హాజరయ్యారని 39 మంది హాజరు కాలేదన్నారు.