అంతర్వేది దేవస్థానం వ్యవస్థాపకులు కొపనాతి కృష్ణమ్మ విగ్రహం మెడలో వేసే గజమాల యాత్ర శుక్రవారం ఘనంగా జరిగింది. ఆయన స్వస్థలం అల్లవరం మండలం ఓడలరేవు నుంచి యాత్ర ప్రారంభమైంది. అల్లవరం మండలం నుంచి మామిడికుదురు, పాసర్లపూడి, నగరం గ్రామాల మీదుగా యాత్ర సాగింది. యువకులు కేరింతలు కొడుతూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా యాత్రలో పాల్గొన్నారు. అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.