అంతర్వేది: భక్తుల కోసం 2 లక్షల లడ్డూలు

75చూసినవారు
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో కళ్యాణోత్సవాలకు వచ్చే భక్తుల కోసం లడ్డు ప్రసాదం సిద్ధమవుతోంది. 80 గ్రాముల బరువు కలిగిన లడ్డు ధర రూ. 15గా నిర్ణయించారు. ప్రాథమికంగా రెండు లక్షల లడ్డూలను సిద్ధం చేయించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. అవసరాన్ని బట్టి మరికొన్ని లడ్డూలను అదనంగా తయారు చేయిస్తామన్నారు. భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్