అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా స్వామివారి రథానికి ప్రత్యేక పూజలు చేసి షెడ్డు నుంచి మాడవీధుల్లోకి తీసుకు వచ్చారు. భక్తుల కోలాహలం నడుమ ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ, ఈవో సత్యనారాయణ మాట్లాడుతూ. కల్యాణోత్సవాలకు వచ్చే నాలుగు లక్షల మంది భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.