అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి గజవాహనంపై నయనానందకరంగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా నృసింహస్వామి గజ వాహనంపై ఆలయ విధుల్లో విహరించారు. ఉత్సవాల్లో 6వ రోజు ఆదివారం గజవాహన సేవను భక్తులు అంగరంగ వైభవంగా జరిపించారు. లక్ష్మీ నరసింహ వరద గోవిందా అంటూ భక్తులు స్వామివారి ఊరేగింపును అనుసరించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ గ్రామోత్సవానికి హాజరయ్యారు.