అంతర్వేదిలో శనివారం రథయాత్ర సందర్భంగా రథానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఉత్సవ కమిటీ ఛైర్మన్ దిరిశాల బాలాజీ అమలాపురం జేసీ నిశాంతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథయాత్రను అర్చకులు వేదమంత్రాలతో కార్యక్రమాన్ని వైభోపేతంగా నిర్వహించారు. లక్షల సంఖ్యలో పాల్గొన్న భక్తులు రథోత్సవంలో సందడి చేశారు. రథంపై ఉభయ దేవేరులతో కొలువైన స్వామిని దర్శించుకున్నారు.