సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మలికిపురం మండలం కేసనపల్లి గ్రామంలో అడబాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోవుల అందాల, పాల పోటీలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పోటీలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలకు చెందిన పుంగనూరు, గిరి ఆవుల అందాల, పాల పోటీలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నారు. విజేతలకు రూ. 6 లక్షల ప్రైజ్ మనీ ఇస్తున్నట్లు నాని తెలిపారు.