విజయవాడలో జరుగుతున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు రాజోలు మండలం నుంచి భారీ స్థాయిలో హిందువులు ఆదివారం బయలుదేరి వెళ్లారు. శ్రీరామ జయరామ జయ జయ రామ అనే పాటలు పాడుతూ బస్సులతో పాటు పలు వాహనాల్లో తరలి వెళ్లారు. జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ అని బిగ్గరగా నినాదాలు చేశారు. దీంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. విశ్వహిందూ పరిషత్ తో పాటు పలు హిందూ సంఘాల నేతల ఆధ్వర్యంలో జన సమీకరణ జరిగింది.