సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో వేంచేసి ఉన్న రాష్ట్రవ్యాప్త ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లక్ష్మీనరసింహస్వామి వారిని ఐజి అశోక్ కుమార్, ఎస్పీ కృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం కళ్యాణ మహోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.