అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మూడవరోజు గురువారం ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ ప్రాంగణంలో నారాయణ స్వామిని స్తుతిస్తూ ఆలపించిన గీతాలు భక్తులను మైమరపించాయి. పలువురు భక్తులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అమితానందం పొందారు. ఆలయ ఈవో సత్యనారాయణ కార్యక్రమాలను పర్యవేక్షించారు.