సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో ఆలయ అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ మేరకు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. అదే విధంగా మండలంలోని గ్రామ గ్రామాన స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు విద్యా సంస్థలలో ఘనంగా నిర్వహించారు.