మూఢ నమ్మకాలపై పాఠశాల స్థాయి నుంచి అవగాహన కల్పించాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో గురువారం మూఢనమ్మకాల నిరోధక చట్టం సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మూఢనమ్మకాలు వ్యవస్థను నాశనం చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వివేకానంద ప్రసాద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ పాల్గొన్నారు.